- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం జగన్‌కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
by Vemula.Srinu Prasad |
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వైఎస్ షర్మిలను ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

X
దిశ, వెబ్ డెస్క్: కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వైఎస్ షర్మిలను ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ తమపై ఏడవటేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు జగనన్న వదిలిన బాణమని రాష్ట్రమంతా తిరిగిన వైఎస్ షర్మిల ఇప్పుడు రివర్స్ అయిందని ఎద్దేవా చేశారు. జగన్ తల్లి, చెల్లి వ్యవహారం వ్యహహారంతో తమకు సంబంధమేంటని ప్రశ్నించారు. ఏదో రకంగా తమపై బురదచల్లడమే పని పెట్టుకున్నారని విమర్శించారు. ఏప్రిల్ తర్వాత జగన్ మాజీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. మాజీ అయితే జగన్ ఎక్కడికి వెళతారో గానీ, అమరావతి మాత్రం రాజధానిగా ఇక్కడే ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story






