- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైబ్రిడ్ మహానాడు అదరగొట్టింది: సీఎం చంద్రబాబు
వర్చువల్ మహానాడు అదరగొట్టిందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. 1875 క్లస్టర్లు ఏర్పాటు చేసి వర్చువల్ మీటింగ్ పెట్టామని ఆయన తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: వర్చువల్ మహానాడు అదరగొట్టిందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. 1875 క్లస్టర్లు ఏర్పాటు చేసి వర్చువల్ మీటింగ్ పెట్టామని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే హైబ్రిడ్ కాన్ఫరెన్స్ ఎలా పెట్టాలో మహానాడు చూపిందని తెలిపారు. రికార్డులు సృష్టించడం, వాటిని బద్దలు కొట్టడం టీడీపీతోనే సాధ్యమని చెప్పారు. ఏ ట్రెండ్ సెట్ చేయాలన్నా టీడీపీతోనే సాధ్యమన్నారు. కార్యకర్తే అధినేత అనేది ఈ మహానాడులో అడుగడుగునా కనిపిస్తోందన్నారు. తెలుగు ప్రజల గుండె చప్పుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నేతలు వస్తుంటారని, కొందరు కుప్పిగంతులు వేస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ పార్టీని శాశ్వతంగా మోసేదని, నిఖార్సైన కార్యకర్తేనని చంద్రబాబు చెప్పారు. ఈ మహానాడు సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఇదొక పెద్ద ప్రయోగమని, 1875 క్లస్టర్లు..12 దేశాల ప్రజలు ఆన్ లైన్‌లోకి వచ్చారని పేర్కొన్నారు. ప్రజల కోసం 2027 విజన్‌ను తీసుకొచ్చామని, స్వర్ణాంధ్రగా మార్చాలని ముందుకెళ్తున్నామని తెలిపారు. టీచర్ నుంచి హోంమంత్రిగా అనిత ఎదిగారన్నారు. చంద్రయ్య గొంతుపై కత్తి పెట్టి తమకు అనుకూలంగా నినాదాలు చేయాలని బెదిరిస్తే చెప్పకుండా జై తెలుగుదేశం అని ప్రాణాలు పొగొట్టున్నారని చంద్రబాబు భావోద్వేగం వ్యక్తం చేశారు.






