- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు రండి, గోశాలను చూడండి.. జగన్, భూమనలకు టీడీపీ ఛాలెంజ్
మాజీ సీఎం జగన్, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రావాలని టీడీపీ ఛాలెంజ్ విసిరింది.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రావాలని టీడీపీ ఛాలెంజ్ విసిరింది. ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి ఎస్వీ గోశాలలో 100 గోవులు మృతి చెందాయని అన్నారు. పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చి గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో చూడాలని కళ్లారా చూడాలని టీడీపీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. అంతే కాకుండా కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఉదయం 10 గంటలకు రావాలని పేర్కొంది.
ఈ ట్వీట్ పై భూమన స్పందించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎంతో ఆవేదనతో ఆవేశంతో సవాల్ విసిరారని పేర్కొన్నారు. తాను ఖచ్చితంగా వస్తానని కానీ శ్రీనివాసరావు అజ్ఞానంతో తిరుమలకు రావాలని సవాస్ చేశారని అన్నారు. తిరుమలలో రాజకీయాలు రాజకీయాలు చేయడం తగదని తెలిసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పని అన్నారు. గోవులు చనిపోయింది తిరుపతిలో అని తిరుమలలో కాదు అనే కనీస పరిజ్ఞానం లేకుండా ట్వీట్ చేశారని మండిపడ్డారు.
చనిపోయిన గోవుల సంఖ్యను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. 43 ఆవులు చనిపోయినట్టు స్వయానా ఈవోనే ప్రకటించారని చెప్పారు. తాను ఖచ్చితంగా వస్తానని కలుసుకుందామని టీడీపీ సవాల్ ను స్వీకరించారు. ఇక ఇప్పటికే భూమన కామెంట్స్ పై మంత్రులు భగ్గుమంటున్నారు. మరోవైపు టీటీడీ ధర్మకర్తల మండలికి ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన గోశాలకు వెళితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.






