- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Camp politics: కూటమి క్యాంపు.. మలేషియా..? వైసీపీ క్యాంపు ఊటీ
గ్రేటర్ విశాఖలో క్యాంప్ రాజకీయాల రసవత్తరంగా మారాయి.

కార్పొరేటర్ల నుంచి పాస్టపోర్ట్ల సేకరణ!
ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు ఊటీలో..
రసవత్తరంగా గ్రేటర్‌విశాఖ రాజకీయాలు
అవిశ్వాసం నేపథ్యంలో తరలింపు
ఇరు పార్టీలుఎత్తుకు పై ఎత్తులు
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రేటర్ విశాఖలో క్యాంప్ రాజకీయాల రసవత్తరంగా మారాయి. అక్కడి మేయర్ పై అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో వైసీపీ (YCP) తమ అనుకూలురైన కార్పొరేటర్లను ఇప్పటికే ఊటీకి తరలించారు. కూటమి కూడా తాము అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లను మలేషియాకు తరలించనున్నట్లు సమాచారం. మలేషియాలో కానీ మరో దేశం కానీ క్యాంప్ పెడతారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయా కార్పొరేటర్ల నుంచి టీడీపీ (TDP) నాయకత్వం పాస్ పోర్టులు సేకరించినట్లు సమాచారం. విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు అందజేయడంతో రాజకీయం వేడెక్కింది. ఇరువర్గాలూ కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో పడ్డాయి.
విశాఖ కార్పొరేషన్‌లో (GVMC) 99 మంది కార్పోరేటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 97గా ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలుపుకుని మొత్తం 112 మంది ఉన్నారు. మేయరుపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన క్రమంలో కార్పొరేషన్‌లో అవిశ్వాసం నెగ్గాలంటే మొత్తం 75 మంది సభ్యులు ఉండాలి. విశాఖ కౌన్సిల్‌లో టీడీపీకి సొంతంగా 29 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వారితో కలిపితే ఆ సంఖ్య 50 వరకు చేరింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ మద్దతుతో 60 దాటుతుంది. జనసేన, బీజేపీ బలం మరో పది నుంచి పన్నెండు వరకు ఉంటుంది. అంటే 75 మంది సభ్యుల మద్దతుకు కూటమి చాలా దగ్గరగా ఉంది. వైసీపీ నుంచినుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే మేయర్ మీద అవిశ్వాసం నెగ్గుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ కూడా తగ్గడం లేదు. అక్కడే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. రెండు పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. ఇప్పటికే తమకు అనుకూలురైన కార్పొరేటర్లను వైసీపీకి ఊటీ, బెంగళూరుకు తరలించింది. కూటమి కూడా కార్పొరేటర్లను మలేషియా లేదా ఇంకో దేశానికి తరలిస్తానరి సమాచారం. వారి నుంచి ఇప్పటికే పాస్‌పోర్టులు సేకరించారని చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానానికి ఇంకా తేదీ ఖరారు చేయలేదు. ఈ లోగా తమ కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో ఇరు పార్టీలు పడ్డాయి.






