- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఏపీలో TDP కూటమిదే పవర్.. తేల్చేసిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్..!
ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రముఖ నేషనల్ మీడియా ఛానెల్ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రముఖ నేషనల్ మీడియా ఛానెల్ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. శనివారం ఏపీ పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించిన ఇండియా టుడే.. తాజాగా ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించింది. ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిదే విజయమని ఇండియా టుడే తేల్చేసింది. ఎన్డీఏ కూటమి 98 నుండి 120 స్థానాల వరకు గెలిచి అధికారం చేపట్టబోతుందని స్పష్టం చేసింది. అధికార వైసీపీ పార్టీ 55-77 సీట్లు మాత్రమే సాధించి అధికారాన్ని కోల్పోబోతుందని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకోబోతుందని ఇండియా టుడే అంచనా వేసింది. అధికార వైసీపీకి 44 శాతం, టీడీపీ 42 శాతం, జనసేన 7 శాతం, బీజేపీ 2 శాతం, కాంగ్రెస్ 2 శాతం, ఇతరులు 3 శాతం ఓటింగ్ పర్సంటేజ్ సాధిస్తాయని వెల్లడించింది. ఇక, ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాల్లో 19 నుండి 23 సీట్లను ఎన్డీఏ కూటమి దక్కించుకుంటుందని, అధికార వైసీపీ కేవలం 2 నుండి 4 ఎంపీ సీట్లకే పరిమితం అవుతోందని అంచనా వేసింది. మరీ ఇండియా టుడే అంచనాలు నిజం అవుతాయో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.






