- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu: కార్యకర్తలారా.. కదలి రండి
అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ ( కార్యకర్తలు కదలిరావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలి..
సీఎం చంద్రబాబు పిలుపు
టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్
దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి రాజధాని (Amaravathi rajadhani) పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ (TDP, BJP, JANASENA) కార్యకర్తలు కదలిరావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, బూత్‌స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధానిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు కదలిరావాలన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పాం.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించారని అన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని, ఆర్థిక కష్టాలున్నా ఈ 10 నెలల్లో పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాంమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు. విశాఖపట్నంలో టీసీఎస్ స్థాపన ద్వారా భారీగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. భోగాపురం విమానశ్రయాన్ని కూడా శరవేగంగా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీసిటీలో ఎల్‌జీ కంపెనీ రూ.5 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టనుందని అన్నారు.
విశాఖలో ఉర్సా కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఎకరా రూ.కోటి, రూ.50 లక్షలకు కేటాయిస్తే 99 పైసలకే ఇచ్చామని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. వైసీపీ నేతలు చేయని తప్పులు ఎవరూ చేయలేదు. వైన్, మైన్, శాండ్, ల్యాండ్... ఇలా అన్నింటిలోనూ దోచుకున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాజధానికి భూములు సమీకరించాం. రాష్ట్ర భవిష్యత్ కోసం రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. కానీ గత పాలకులు మూడు రాజధానుల పేరుతో రాజధానిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించిందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, యువత ఆకాంక్ష తీరే విధంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు.
కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించేందుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నామని అన్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లిన సమయంలో ఇప్పటికే 8 నియోజకవర్గాల కార్యకర్తలతో నేరుగా సమావేశమయ్యాను. పార్టీకి కార్యకర్తలే మూల స్థంబాలని ఆయన తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో మూడు పార్టీల కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ఏ నాయకుడూ వ్యవహరించడానికి అవకాశం లేదన్నారు. ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో...కార్యకర్తలకు కూడా అంతే ఇస్తాఅని తెలిపారు. కడపలో మహానాడును ఘనంగా నిర్వహించుకుందాం. ఏ ఎన్నికలు జరిగినా ఎన్డీఏనే గెలవాలన్నారు. వచ్చే నెలలోనే అన్నదాత, తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.






