- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Swandhra: స్వర్ణాంధ్ర సాధనకు.. టాస్క్‌ఫోర్స్
స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

= చైర్మన్‌గా సీఎం చంద్రబాబు నాయుడు
= పారిశ్రామిక అభివృద్దికి బ్లూ ప్రింట్
దిశ, డైనమిక్ బ్యూరో : స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.ఈ క్రమంలో స్వర్ణాంధ్ర సాధన కోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఈ టాస్క్‌ఫోర్స్ (TaskForce) ఏర్పాటు కానుంది. కో చైర్‌పర్సన్‌గా టాటా సన్స్చంద్రశేఖరన్వ్యవహరించనున్నారు. టాస్క్ఫోర్స్సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్బెనర్జీ, అపోలో ఆస్పత్రి వైస్చైర్పర్సన్ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, జీఎం రావు , ఎల్ఎండ్ టీ చైర్మన్సుబ్రహ్మణ్యన్, ఏపీ సీఎస్విజయానంద్ ఉంటారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి బ్లూప్రింట్తయారు చేసేలా ఈ టాస్క్ఫోర్స్పనిచేయనుంది. పారిశ్రామిక అవసరాలను అనుగుణంగా ఈ బ్లూ ప్రింట్‌ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చూస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.






