- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chandrababu Naidu: టార్గెట్.. యోగాంధ్ర.. నెలరోజుల్లో రెండు కోట్ల మందితో యోగా
నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ఏపీలో నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

నేటి నుంచి నెల రోజులు పాటు ప్రత్యేక కార్యక్రమాలు
రెండు కోట్ల మంది పాల్గొనాలనేది సంకల్పం
యోగా ప్రాచుర్యం ఘనత నరేంద్ర మోడీ
రిజిస్ట్రేషన్యాప్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్
దిశ, డైనమిక్ బ్యూరో: నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ఏపీలో నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే నెల 21వ తేదీన విశాఖపట్నం (Visakhapatnam) బీచ్ఒడ్డున ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు-నాయుడు ఈరోజు సచివాలయంలో మీడియా కాన్ఫరెన్స్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. యోగా ప్రాముఖ్యత ప్రపంచం గుర్తించేలా చేసింది ఆయనే అన్నారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. వచ్చే నెల 21న విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా డే (Internation Yoga Day) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు (World Record) కానుందన్నారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అన్నారు. అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని ఆయన సూచించారు.
ఒత్తిడి నుంచి ఉపశమనం కలగాలంటే యోగా తప్పనిసరి అని పేర్కొన్నారు. ఫోటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం ఇది కాదు అని అన్నారు. యోగా పాజిటివ్ థింకింగ్ ను అలవాటు చేస్తుందన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒక గంట ప్రాణాయామం, యోగ ప్రాక్టీస్ చేయాలని సూచించారు. ఇవాల్టి నుంచి నెలపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనీసం రెండు కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలనేది తన సంకల్పం అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, (Art of Living) ఈషా ఫౌండేషన్, పతంజలి, బ్రహ్మకుమారి వంటి ప్రముఖ సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. దేశంలో ఉండే ప్రముఖ యోగ గురువులను ఆహ్వానిస్తామని తెలిపారు. ప్రతి ఒక్క రిలో ప్రగాఢమైన మార్పు తీసుకువచ్చే కార్యక్రమం ఇది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ఒక దీక్షతో చేస్తున్నారని అన్నారు. అందుకే ఆయనకు ఎంత పని చేసిన అలసట ఉండదన్నారు. విజన్ స్వర్ణాంధ్రలో హెల్తీ, వెల్దీ, హ్యాపీ సొసైటీని రూపొందించాలని సంకల్పించామని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి.. అదే విధంగా ఆదాయాన్ని కూడా పెంచాలనేది దీని ఉద్దేశమన్నారు. ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమ రిజిస్ట్రేషన్కోసం యాప్ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్తదితరులు పాల్గొన్నారు.






