తాత్కాలికంగా కనిపించాయి.. అపోహలొద్దు: టీటీడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-25 16:27:18  IST  )

తిరుమల జపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొళాయిలలో నీరు తెల్లగా వస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ వివరణ ఇచ్చింది. ..

తాత్కాలికంగా కనిపించాయి.. అపోహలొద్దు: టీటీడీ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల జపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొళాయిలలో నీరు తెల్లగా వస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీటీడీ వివరణ ఇచ్చింది. వీడియోలో కనిపించినట్లుగా కొళాయిలో నుంచి వచ్చిన నీరు కొన్ని సెకన్లలోనే సహజ స్థితికి చేరుకుని పారదర్శకంగా మారుతోందని, అధిక వాటర్ ప్రెజర్ కారణంగా నీటిలో సూక్ష్మ గాలి బుడగలు ఏర్పడటం వల్ల నీరు తాత్కాలికంగా తెల్లగా కనిపిస్తోందని నిపుణులు తెలిపారు. ఈ నీటిని తిరుమలలోని టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్‌లో పరీక్షించగా, నీరు పూర్తిగా స్వచ్ఛమైనదేనని నిర్ధారణ అయింది. నీటిలో ఎలాంటి దుర్వాసన, అడుగున అవశేషాలు లేదా ఇతర మలినాలు లేవని ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ నిపుణులు తెలిపారు. అందువల్ల భక్తులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Next Story