పవన్ కల్యాణ్ చేతిలో ‘కరుంగాలి కంబు’.. బహుకరించింది ఎవరో తెలుసా?

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-26 03:14:51  IST  )

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను తమిళనాడు(Tamil Nadu) రాజకీయ నాయకుడు కేఎస్ రాధాకృష్ణన్(KS Radhakrishnan) కలిశారు.

పవన్ కల్యాణ్ చేతిలో ‘కరుంగాలి కంబు’.. బహుకరించింది ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను తమిళనాడు(Tamil Nadu) రాజకీయ నాయకుడు కేఎస్ రాధాకృష్ణన్(KS Radhakrishnan) కలిశారు. శుక్రవారం పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలో పార్టీ ఆఫీస్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాష సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై చర్చించారు. పర్యావరణపరమైన విషయాల్లో, రైతాంగ పోరాటం, కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను పవన్ కల్యాణ్‌కు రాధాకృష్ణన్ తెలియచేశారు. పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత కరుణానిధి, నెడుమారన్, ఈవీకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. అనంతరం పవన్ కల్యాణ్‌ను సత్కరించి ‘కరుంగాలి కంబు’ను బహుకరించారు. కరుంగాలి కంబుకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ వివరించారు.

Next Story