వినాయక నిమజ్జనం వేళ తాడిపత్రిలో రణరంగం.. భారీగా పోలీసుల మోహరింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-31 11:36:57  IST  )

వినాయక నిమజ్జనం వేళ తాడిపత్రి రణరంగంగా మారింది..

వినాయక నిమజ్జనం వేళ తాడిపత్రిలో రణరంగం.. భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: వినాయక నిమజ్జనం(Ganesha immersion) వేళ తాడిపత్రి(Tadipatri) రణరంగంగా మారింది. తెలుగుదేశం పార్టీ(Telugu desam Party)లో వర్గ విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Jc Prabhakar Reddy), మరో నేత కాకర్ల రంగనాథ్(Kakarla Ranganath) వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో వినాయక శోభాయాత్ర నిర్వహించారు.

అయితే ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల వర్గీయులు ఎదురుపడ్డారు. దీంతో జేసీకి, కాకర్లకు అనుకూలంగా అనుచరులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. ఈ సమయంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. టీడీపీలోనే ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

Next Story