- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ బస్సులు ఎలా నడిపిస్తారో చూస్తా.. ఓనర్లకు జేసీ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రైవేటు బస్సు ఓనర్లపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.....

దిశ, వెబ్ డెస్క్: ప్రైవేటు బస్సు ఓనర్ల(Private Bus Owners)పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానించకుండా హైదరాబాద్(Hyderabad)లో ప్రైవేటు బస్సు ఓనర్లు సమావేశం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వానికి బస్సులు లీజుకు ఇచ్చిన వాళ్లు ఎలా నడుపుకుంటారో చూస్తానని హెచ్చరించారు. సమావేశం నిర్వహించిన వాళ్లకు బస్సులపై అవగాహన లేదన్నారు. తాము ఎప్పటి నుంచో బస్సు వ్యాపారంలో ఉన్నామని, మీటింగ్‌కు తనను ఆహ్వానించకపోయినా బాధేమీ లేదన్నారు. ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా..?. ముందు ఎవరైతే బస్సులు లీజుకు ఇచ్చారో వాళ్లను తిప్పనివ్వద్దు.. ఎవరెవరో ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నారు. బయటవాళ్లు లీజుకు ఎలా ఇస్తారు. వాళ్లను బయటకు జరపండి’’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.






