- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన చెబితే లేవమంటే లేస్తా.. కూర్చోమంటే కూర్చుంటా: జేసీ ప్రభాకర్ రెడ్డి
సీఎం చంద్రబాబు లేవమంటే లేస్తానని, కూర్చోమంటే కూర్చుంటానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) లేవమంటే లేస్తానని.. కూర్చోమంటే కూర్చుంటానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) అన్నారు. తాడిపత్రిలో అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో పలు విమర్శలు వినిపించాయి. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. స్థానిక డీపీవో నాగరాజు అవినీతి, లంచాల చిట్టా తన వద్ద ఉందని, వాటిని కోర్టుకు అందజేస్తానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సబ్ రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై తాడిపత్రి మున్సిపల్ స్థలంలో అప్పటి ఎమ్మెల్యే ఇల్లు కట్టుకున్నారని జేసీ ఆరోపించారు. తాడిపత్రిలో వెలిసిన అక్రమ లే అవుట్లపై గత ఎనిమిది నెలలుగా డీపీవో నాగరాజుతో పాటు జాయింట్ కలెక్టర్ సహా జిల్లా కలెక్టర్‌కు చాలా వినతులు అందజేశామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పినా ఆ లే అవుట్లను డీపీవో నాగరాజు పట్టించుకోలేదని, కార్యాలయానికి వెళితే తప్పించుకుని తిరుగుతున్నారని జేసీ పేర్కొన్నారు.
చంద్రబాబుకు విజన్ ఉందని, అందుకే ఆయన్ను ఫాలో అవుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే.. తాను ఊరిని బాగుచేసుకుంటానని ఆయన తెలిపారు.






