తిరుమల శ్రీవారిని సేవలో టీ20 అమెరికా క్రికెట్ జట్టు

by Naga Rani Yarlagadda |

టీ20 అమెరికా క్రికెట్ జట్టులో భారత సంతతి సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని సేవలో టీ20 అమెరికా క్రికెట్ జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 అమెరికా క్రికెట్ జట్టు సభ్యులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జట్టులోని భారత సంతతి ప్లేయర్లు శ్రీవారిసేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు. ఆలయ ప్రాంగణం, పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించిన ఐసీసీ, బీసీసీఐ, ఏపీ క్రికెట్ అసోసియేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ జట్టులో ఉన్న సభ్యుల్లో ఒకరు తెలుగు కుర్రాడే. సాయితేజ తండ్రి నాగేశ్వర్ రెడ్డి స్వస్థలం నంద్యాలజిల్లాలోని కోవెలకుంట్ల మండలం కమలాపురి గ్రామం. ఉద్యోగరీత్యా అమెరికాలో సెటిలవ్వడంతో సాయితేజ అక్కడే పుట్టి పెరిగాడు. ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్, మహారాష్ట్రకు చెందిన శుభమ్ రంజా, గుజరాత్ కు చెందిన మోనాంక్ పటేల్ (కెప్టెన్), ముంబైకు చెందిన హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, కర్ణాటక మూలాలున్న సంజయ్ కృష్ణమూర్తి ఈ జట్టులో ఉన్నారు.

నేడు భక్తుల రద్దీ సాధారణం

నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు, దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-5 గంటల్లో స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుందని టీటీడీ తెలిపింది. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2-3 గంటలు పడుతుందని పేర్కొంది. నిన్న (సోమవారం) 73,776 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 23,291 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.42 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.

Next Story