- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. వద్దని చెప్పినా ఈతకు వెళ్లి విదేశీయుడు మృతి
ఈత సరదా విదేశీయుడి ప్రాణం తీసింది....

దిశ, వెబ్ డెస్క్: ఈత సరదా విదేశీయుడి ప్రాణం తీసింది. ఈ ఘటన విశాఖ జిల్లా యారాడ బీచ్(Yarada Beach)లో జరిగింది. 16 మంది ఇటలీ దేశస్తులు(Italians) ఈ రోజు ఉదయం యారాడ బీచ్‌కు వెళ్లారు. స్నానం చేసేందుకు సముద్రంలోకి వెళ్లారు. అయితే సముద్రం(Sea)లో చాలా దూరం వెళ్లారు. వెంటనే అప్రమత్తమైన మెరైన్ పోలీసులు(Marine Police).. లోతు ఎక్కువగా ఉంటుందని వెనక్కి రావాలని, ఈతకు అనుకూలం కాదని తెలిపారు. కానీ విదేశీయులు వినలేదు. హెచ్చరికలు పట్టించుకోకుండా సముద్రంలో ఈతకు వెళ్లారు. ఇంతలో ఇద్దరు ఇటాలియన్లు గల్లంతయ్యారు. దీంతో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు.. ఇద్దరిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఇటలీ నుంచి వచ్చిన విదేశీయుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






