రాష్ట్రంలోని మహిళలకు తీపికబురు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-06 09:28:13  IST  )

ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది.

రాష్ట్రంలోని మహిళలకు తీపికబురు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మొత్తం 12 అంశాలపై సుధీర్ఘంగా చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కెబినెట్ ఓకే చెప్పింది. ఈనెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీకి కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నూతన బార్ పాలసీకి కూడా ఆమోదం తెలిపారు.

నాయిబ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలోని 22 APTDC హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అమతులు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూ బదలాయింపు రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్‌కు ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీ ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. APIICకి రూ.7,500 కోట్ల రుణం తీసుకునేందుకు ఓకే చెప్పారు. ఐదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి, చివరగా మావోయిస్ట్ పార్టీ, ఆర్‌డీ‌ఎఫ్ పార్టీ కార్యకలాపాలపై మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Next Story