ఆశావహులకు తీపి కబురు.. కొత్త బార్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-14 04:20:03  IST  )

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీ (New Bar Policy)ని ప్రారంభంచింది.

ఆశావహులకు తీపి కబురు.. కొత్త బార్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఎక్సైజ్ శాఖ కొత్త బార్ పాలసీ (New Bar Policy)ని ప్రారంభంచింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ నూతన బార్ పాలసీ సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. ప్రజారోగ్యం, పారదర్శకత, సామాజిక సమానత్వంపై దృష్టి సారిస్తూ పాలసీని రూపొందించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. కాగా, బార్ లైసెన్స్‌లకు దరఖాస్తులు స్వీకరించి లాటరీ పద్ధతిన కేటాయించనున్నారు. ప్రతి బార్ లైసెన్స్‌ (Bar License)కు కనీసం 4 దరఖాస్తులు రావాలనే నిబంధన పెట్టారు. ఆసక్తిగల వారు అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలు, అదనంగా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక లైసెన్స్ ఫీజు జనాభా ప్రతిపదనకన నిర్ణయిస్తారు. 50 వేలు కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.35 లక్షలు, 50 వేలు నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.55 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.75 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. కొత్త బార్ పాలసీ విధానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా బార్లు ఉదయం 10 నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు మాత్రమే నడపాలని తాజా నోటిఫికేషన్‌‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

Next Story