ఏపీ ప్రజలకు తీపి కబురు.. 3 రోజుల పాటు ‘బీచ్ ఫెస్టివల్’

by Kema Shiva Kumar |

రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది.

ఏపీ ప్రజలకు తీపి కబురు.. 3 రోజుల పాటు ‘బీచ్ ఫెస్టివల్’
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు బాపట్ల (Bapatla) జిల్లా సూర్యలంక (Surya Lanka)లో బీచ్ ఫెస్టివల్‌ (Beach Festival)ను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈవెంట్‌లో భాగంగా అడ్వెంచర్ స్పోర్ట్స్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్టివల్‌‌‌లకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 27న సీఎం చంద్రబాబు (CM Chandrababu) బీచ్ ఫెస్టివల్‌కు హాజరై రూ.97 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటకంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రోజువారీ పనుల్లో బీజీబిజీగా గడుపుతున్న ప్రజల్లో ఉల్లాసాన్ని.. ఉత్సాహాన్ని నింపేందుకు ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం పట్ల పట్ల జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story