తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-01 15:50:06  IST  )

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం (Government Of India) పండుగ పూట తీపికబురు చెప్పింది.

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. 8 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం (Government Of India) పండుగ పూట తీపికబురు చెప్పింది. ఈ మేరకు ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశ వ్యాప్తంగా 57 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వాటి నిర్మాణాలకు రూ.5,863 కోట్ల నిధులు కేటాయించేందుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు 4, తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఈ క్రమంలోనే రాష్ట్రానికి కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడం పట్ల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ‘X’ (ట్విట్టర్) వేదికగా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని లోకేశ్ కామెంట్ చేశారు. ఏపీలో మంగసముద్రం (చిత్తూరు), బైరుగానిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)లో, తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి జిల్లాలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.

Next Story