భక్తులకు తీపికబురు.. వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు

by Ramesh Naini |

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం-తిరుపతి మధ్య ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్లను ఇకపై వారానికి నాలుగు రోజులు నడపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు.

భక్తులకు తీపికబురు.. వారానికి నాలుగు రోజులు రామేశ్వరం-తిరుపతి రైలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం-తిరుపతి మధ్య ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్లను ఇకపై వారానికి నాలుగు రోజులు నడపనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆది, గురు, శుక్రవారాల్లో రామేశ్వరం నుంచి తిరుపతికి, అలాగే సోమ, శుక్ర, శనివారాల్లో తిరుపతి నుంచి రామేశ్వరానికి ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఈ రైళ్లకు భారీగా ప్రయాణికుల స్పందన లభిస్తుండటంతో అదనంగా మరో రోజు రైలు సేవలను ప్రారంభించాలని రైల్వే నిర్ణయించింది.

దీంతో రెండు పుణ్యక్షేత్రాల మధ్య ప్రయాణించే భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు రామేశ్వరానికి వచ్చే యాత్రికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని అధికారులు తెలిపారు. కొత్తగా చేర్చిన రైలు వివరాలు, సమయాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

Next Story