‘స్వర్ణాంధ్ర విజన్ - 2047’.. కాసేపట్లో మంత్రులు, హెచ్‌వోడీలతో CM చంద్రబాబు భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-12 02:20:25  IST  )

సీఎం చంద్రబాబు ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

‘స్వర్ణాంధ్ర విజన్ - 2047’.. కాసేపట్లో మంత్రులు, హెచ్‌వోడీలతో CM చంద్రబాబు భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల అధిపతులు (HoDs), కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ‘స్వర్ణాంధ్ర విజన్ - 2047’ డాక్యుమెంట్‌పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఉదయం 10.30కి ఈ సమావేశం ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ప్రధానంగా భేటీలో విజన్ 2047లోని 10 కీలక సూత్రాలపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి వివరణాత్మక ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆ 10 సూత్రాలపై డిస్కస్ చేయనున్నారు. అందులో పేదరిక నిర్మూలన (Zero Poverty), యువతకు భారీస్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మానవ వనరుల వికాసం, స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటు, సాగు, తాగునీటి వనరుల సమర్థ నిర్వహణ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడించి రైతు ఆదాయం పెంచడం, అంతర్జాతీయ స్థాయి రవాణా-మౌలిక సదుపాయాలు, విద్యుత్-ఇంధన ఖర్చుల తగ్గింపు, పునరుత్పాదక ఇంధనంపై దృష్టి, ఉత్పత్తి నాణ్యత (Product Perfection), పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్, పరిపాలనలో సామాన్యుడి జీవితంలో అత్యాధునిక సాంకేతికత (AI, Blockchain) వినియోగం లాంటి అంశాలు ఉన్నాయి.

అదేవిధంగా ఇదే సమావేశంలో కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమే కాకుండా, ఆదాయార్జన మార్గాలు, రెవెన్యూ సంస్కరణలు, మరియు ఆస్తుల భద్రత కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలపాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ వేడుకల కోసం తన స్వగ్రామమైన నారావారిపల్లెకు బయలుదేరనున్నారు.

Next Story