స్వర్ణాంధ్ర.. వికసిత్ భారత్ నిర్మాణంలో మార్గదర్శనం చేస్తుండాలి

by Thanuru Gopichand |

భారత రాజ్యాంగ సూత్రాలు స్వర్ణాంధ్ర.. వికసిత్ భారత్ నిర్మాణంలో మార్గదర్శనం చేస్తూనే ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

స్వర్ణాంధ్ర.. వికసిత్ భారత్ నిర్మాణంలో మార్గదర్శనం చేస్తుండాలి
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రాజ్యాంగ సూత్రాలు స్వర్ణాంధ్ర.. వికసిత్ భారత్ నిర్మాణంలో మార్గదర్శనం చేస్తూనే ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలను తెలియజేశారు. నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అన్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు. రాజ్యాంగ నిర్మాతలను.. ముఖ్యంగా రూపకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ను స్మరించుకోవడం ద్వారా వారందరినీ గౌరవిద్దామన్నారు. వారి దార్శనిక నాయకత్వంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలను నెరవేర్చడంలో రాజ్యాంగ విలువలు దిశా నిర్దేశం చేస్తున్నాయని తెలిపారు.

హక్కులకు పెద్దదిక్కుగా నిలిచిన రాజ్యాంగం : మంత్రి లోకేష్

రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికి మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. పౌరుల హక్కులకు పెద్దదిక్కుగా నిలిచిన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ రచనా కమిటీ సేవలు స్మరించుకుందామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పాఠశాల విద్యా శాఖ వినూత్నంగా జరుతోందన్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులకు మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. స్టూడెంట్ అసెంబ్లీ పూర్తయ్యాక విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బొమ్మలు, సులభమైన భాషలో రూపొందించిన బాలల భారత రాజ్యాంగం ఆవిష్కరణ జరగనుందని వెల్లడించారు.

Next Story