- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి అచ్చెన్నాయుడు
by Jakkula.Mamatha |
స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) పేర్కొన్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర యువతకు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతే దేశ భవిష్యత్తు అన్న స్వామి వివేకానంద మాటలు నేడు ఏపీలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) సారధ్యంలో సాకారం అవుతున్నాయని చెప్పారు. ఆత్మవిశ్వాసం, కర్తవ్య నిబద్ధత, పరోపకారం అనే పదాలకు నిలువెత్తు రూపం స్వామి వివేకానంద అని ప్రశంసించారు. కోట్లాది మంది యువతరానికి ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Next Story






