- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రజలకు అలర్ట్..నేటి నుంచి గ్రామ సభలు, ఇక ఆ సమస్యలకు చెక్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి ఏపీలో మరో కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. స్వామిత్వ కార్యక్రమం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి ఏపీలో మరో కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏపీలో స్వామిత్వ కార్యక్రమం ( SVAMITVA Scheme ) నిర్వహించనుంది ఏపీ సర్కార్. 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీ కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ కంఠాల్లో ఇండ్లు, స్థలాలకు అర్హులైన యజమానులకు ప్రాపర్టీ కార్డుల ద్వారా ముందు అభ్యంతరాలకు స్వీకరణ చేయనుంది ప్రభుత్వం. దీనికోసం ఇవాళ్టి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణ, అభివృద్ధి, రెవెన్యూ సర్వే శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. డ్రోన్ సర్వే తర్వాత గ్రామ కంఠాలలో ఆస్తులకు సంబంధించిన కొలతలు నిర్ధారిస్తారు. ఆ తర్వాత 2300 గ్రామాల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదికలు సిద్ధం చేస్తారు. గ్రామ సభలలో ప్రజల నుంచి వీటిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ప్రాపర్టీ కార్డులు జారీ అవుతాయి. ఈ కార్యక్రమాన్ని చాలా పారిదర్శకంగా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.






