- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముచ్చుమర్రి ఘటనలో సంచలనం.. నిందితుడి మేనమామ అనుమానాస్పద మృతి

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. అయితే బాలిక మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. కానీ తాజాగా సంచలన పరిణామం చోటు చేసుకుంది. నిందితులో ఒకరి మేనమామ అనుమానాస్పద మృతి చెందారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించారు. ఆత్మహత్య, హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఆయన్ను ఇటీవల పోలీసులు విచారించారు. అయితే లాకప్ డెత్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుడి ముఖం, ఒంటిపై గాయాలుండటంతో పోలీసులపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ పేరుతో పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు.
Next Story






