కస్తూర్బా స్కూల్‌లో విషాదం: విద్యార్థిని అనుమానాస్పద మృతి

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విషాదం చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని నవ్య హాస్టల్‌లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది...

కస్తూర్బా స్కూల్‌లో విషాదం: విద్యార్థిని అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalle District) అచ్యుతాపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో విషాదం చోటు చేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని నవ్య హాస్టల్‌లో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఏదో కుట్టిందని తోటి విద్యార్థినులకు, సిబ్బందికి నవ్య చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పాఠశాల యంత్రాంగం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

బాలిక మృతదేహంపై కొన్ని అనుమానాస్పద గుర్తులు ఉండటంతో ఇది పాము కాటు వల్ల జరిగిన మరణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పాఠశాల పరిసరాల్లో పారిశుధ్య లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story