- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తూరులో యువకుడి అనుమానాస్పద మృతి
చిత్తూరు జిల్లాలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గంగవరం మండలం డీ.కురప్పల్లిలో జయదీప్ అనే యువకుడు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు.

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గంగవరం మండలం డీ.కురప్పల్లిలో జయదీప్ అనే యువకుడు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అయితే ఓ అమ్మాయి పిలిచింది అనే కారణంతో జరిగిన గొడవలో అతడిని స్నేహితులు మిద్దెపై నుండి తోసి చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. జయదీప్ బైక్ పై నుండి కిందపడ్డాడని ఆస్పత్రిలో చేర్పించారని, కానీ గ్రామంలోని వాళ్లను అడిగితే మిద్దెపై నుండి కిందపడి మరణించాడని చెబుతున్నారని మృతుడి సోదరుడు చెబుతున్నాడు. జయదీప్ ను స్నేహితులే చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు ఒక్కోసారి ఒక్కోలా సమాధానం ఇస్తున్నారని అంటున్నారు. మొదట బైక్ పై నుండి కిందపడినట్టు చెప్పారని, తరవాత మిద్దెపై నుండి కిందపడినట్టు మాట మార్చారని అంటున్నారు. బంధువుల ఫిర్యాదుతో ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకోగా విచారణ జరుపుతున్నారు. యువకుడి అనుమానస్పద మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.






