- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానంతో అమానుషం.. భర్త చేతిలో భార్య హతం
అనుమానం పెంచుకున్న భర్త తన భార్యను అంతమొందించాడు.

దిశ, వెబ్ డెస్క్ : భార్యపై అనుమానంతో అమానుష చర్యకు పాల్పడ్డాడు ఓ భర్త. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట (Chilakaluripeta) మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సాల్మన్ రాజు, పుష్ప అనే దంపతులు చిలకలూరిపేట మండలంలోని వేలూరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. వివాహం అయినప్పటి నుంచి భార్యను సాల్మన్ రాజు (Solmon Raju) అనుమానించేవాడు. దీంతో తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం తాగివచ్చి భార్యతో తగవులాడేవాడు. ఇటీవల భార్యాభర్త మధ్య గొడవలు మరింత ముదిరాయి. ఇంటి ఆర్థిక పరిస్థితిని సాల్మాన్ రాజు పట్టించుకోకపోవడంతో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో సాల్మాన్ రాజు ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలని భావించాడు. మంగళవారం అర్థరాత్రి తన భార్య నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో కిరాతకంగా దాడి చేశాడు. ఈ దాడిలో పుష్ప తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గొడవను ఆపారు. పుష్పను గుంటూరులోని జీజీహెచ్ కు చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో బాధితురాలు మరణించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






