- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడ ఉగ్ర కుట్ర కేసు: కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
విజయవాడలో ఉగ్ర లింకుల కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ..

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో ఉగ్ర లింకుల కేసు(Terror Links Case) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితులు షరీఫ్, సొహైల్ బేగ్, దానిష్, అబ్దుల్ సలాం, సైదా బేగంలను మరింత లోతుగా విచారించేందుకు కొత్తపేట పోలీసులు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
జ్యుడీషియల్ కస్టడీలో నిందితులు
ప్రస్తుతం ఈ ఐదుగురు నిందితులు రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా సాగిన వీరి కార్యకలాపాలు, నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను వెలికితీసేందుకు పోలీసు కస్టడీ అనివార్యమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు అనుమతి లభిస్తే మరిన్ని కీలక నిజాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నరాు.
ఈ కస్టడీ పిటిషన్‌పై...
ఈ కస్టడీ పిటిషన్‌పై వాదోపవాదాలను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు కోర్టు నిర్ణయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. నిందితులకు పోలీసు కస్టడీ లభిస్తే ఈ నెట్‌వర్క్ ఏయే ప్రాంతాలకు విస్తరించి ఉందనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.






