Nara Lokesh Yuvagalam పాదయాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్!

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-21 11:37:53  IST  )

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Nara Lokesh Yuvagalam పాదయాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్!
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈనెల 27న కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోగా పాదయాత్రకు ఇంకా అనుతమతి లభించలేదు. లోకేశ్ షెడ్యూల్ మాత్రమే ఇచ్చారని పోలీసులు తెలిపారు. అనుమతి కోరలేదని కుప్పం పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని టీడీపీ నేతలు తెలిపారు. కాగా కుప్పం బైపాస్ లో భారీ సభకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే పాదయాత్రలో భాగంగా నారాలోకేశ్ మొత్తం 400 రోజుల్లో 4వేల కిలో మీటర్లు నడవనున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ChandraBabu Naidu, Lokesh కు ప్రాణహాని: మాజీ ఎమ్మెల్సీ Buddha Venkanna వ్యాఖ్యలు

కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. రేపే ప్రిలిమినరీ ఎగ్జామ్

Next Story