- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానాస్పద స్థితిలో సస్పెండెండ్ ఏఎస్ఐ మృతి
పడమట పీఎస్ లో పనిచేస్తూ సస్పెన్షన్ కు గురైన ఏఎస్ఐ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన విజయవాడలో వెలుగుచూసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఒక ఏఎస్ఐ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా యనమలకుదురులో వెలుగుచూసింది. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తోన్న వీరవల్లి గోపి వెంకట దుర్గాప్రసాద్ (54) ఒక కేసు విషయంలో 15 రోజుల క్రితం సస్పెన్షన్ కు గురయ్యారు. విధుల నుంచి సస్పెన్షన్ కు గురి కావడంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో యనమలకుదురు కరకట్ట శివారులో ఉన్న ఒక పాకలో దుర్గాప్రసాద్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించారు. సమాచారం అందుకున్న పెనమలూరు పోలీసులు దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Next Story






