బోటు ప్రమాదాలపై ఆర్డీవో అలర్ట్.. ఫిట్‌నెస్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-15 10:47:59  IST  )

పాపికొండల పర్యటనకు వెళ్లి విహార యాత్రికులు ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా ఓ బోటు పాపికొండల మధ్య గోదావరి నదిలో నిలిచిపోవడం ఉత్కంఠ రేపింది. ..

బోటు ప్రమాదాలపై ఆర్డీవో అలర్ట్.. ఫిట్‌నెస్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: పాపికొండల(Papikondalu) పర్యటనకు వెళ్లి విహార యాత్రికులు(Tourists) ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా ఓ బోటు పాపికొండల మధ్య గోదావరి నది(Godavari River)లో నిలిచిపోవడం ఉత్కంఠ రేపింది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గత ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటకుల భద్రతపై ఫోకస్ పెట్టారు. లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బోట్ల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. గోదావరి నదిలో పర్యాటకుల విహారయాత్రలను నిలిపివేసి మరి సోదాలు చేస్తున్నారు.

బోట్లు పూర్తి ఫిట్‌నెస్‌ ఉండాల్సిందే

దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం వద్ద ఉన్న బోటింగ్ పాయింట్‌ను ఆర్డీవో స్వాతి(RDO Swathi) పరిశీలించారు. స్థానిక అధికారులు, బోటు యజమానులతో ఆమె మాట్లాడారు. ఇటీవల గోదావరి నదిలో జరిగిన బోటు ఘటనపై ఆరా తీశారు. రేవు వద్ద పర్యాటకులకు అందిస్తున్న సౌకర్యాలు, రక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి బోటుకు ఫిట్ నెస్ తప్పనిసరిగా ఉండాలని ఆర్డీవో స్వాతి ఆదేశించారు. అలా లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. బోట్లు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటేనే నదిలోకి అనుమతించాలని సూచించారు. తమ అనుమతి లేకుండా పర్యాటక బోట్లు ఎట్టి పరిస్థితుల్లో నదిలోకి వెళ్లడానికి వీల్లేదని ఆర్డీవో స్వాతి హెచ్చరించారు.

Next Story