- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) నిందితులుగా ఉన్న ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. దీంతో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. లిక్కర్ స్కామ్ కేసుపై బుధవారం (మే 7) ఏపీ హైకోర్టులో (AP High Court) విచారణ జరగ్గా.. అక్కడ కూడా ముందస్తు బెయిల్ రిజెక్ట్ అయింది. ఈ కుంభకోణంలో అన్ని వివరాలు బయటకు రావాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకుని విచారించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
అంతకుముందే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాగా.. హైకోర్టు విచారణ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ.. మే 8కి విచారణ వాయిదా వేసింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ రిజెక్ట్ అవ్వడంతో.. నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా.. దానిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ముగ్గురికీ ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.






