- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కొమ్మినేని అరెస్ట్ పై సుప్రీం తీర్పు’.. మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్
ఏపీ(Andhra Pradesh)లో రాజధాని అమరావతి మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో రాజధాని అమరావతి మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో ఆయనకు జస్టిస్ పీకే విశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఇవాళ(శుక్రవారం) సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా(Former Minister Roja) స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అక్రమమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని ఆమె అన్నారు. ఈ క్రమంలో కొమ్మినేని శ్రీనివాసరావును తక్షణమే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు పై రోజా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎటువంటి సంబంధం లేదని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం రక్షణపై ఇది గట్టి సందేశం. సాక్షి టీవీ పై విష ప్రచారం చేసిన పచ్చ మీడియాకు చెంపదెబ్బ వంటిది. రెడ్ బుక్ రాజకీయాలకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నిజాయితీపరులైన జర్నలిస్టులకు ఇది వజ్రాయుధం లాంటి తీర్పు’’ అని మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






