- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవానీపురం కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే!
by Ramesh Naini |
విజయవాడలోని భవానీపురంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పలు నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడలోని భవానీపురంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య పలు నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. లక్ష్మీ రామ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూ వివాదంపై హైకోర్టు సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, అధికార యంత్రాంగం బుల్డోజర్లతో నిర్మాణాలను తొలగిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు 42 నిర్మాణాలను కూల్చివేయడంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
ఈ క్రమంలోనే భవానీపురం కూల్చివేతలపై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 31 వరకు కూల్చివేతలపై స్టే విధించినట్లు సమాచారం. స్టే నేపథ్యంలో తక్షణమే కూల్చివేతలు నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Next Story






