- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. పిల్లల్ని చంపి ఉరివేసుకున్న తల్లి
రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. వినుకొండ గ్రామీణ మండలం విఠంరాజుపల్లిలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికులతో కంటతడి పెట్టించింది. భారతి (28) తన పిల్లలు హేమంత్ రెడ్డి (5), తేజ (3)లను చంపి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో "నా చావుకు ఎవరూ కారణం కాదు" అని భారతి రాసినట్లు తెలుస్తోంది. భారతి ఈ ఘోరమైన నిర్ణయం ఎందుకు తీసుకుందన్న విషయంపై స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.






