- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయికృష్ణ కేసు : నాగరాజు పోలీసు కస్టడీ విచారణపై తీర్పు రిజర్వ్
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ (సస్పెండెడ్) నాగరాజు పోలీసు కస్టడీ విచారణపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రౌడీషీటర్ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ (సస్పెండెడ్) నాగరాజు పోలీసు కస్టడీ విచారణపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో నాగరాజును విచారించేందుకు హైకోర్టు కొన్ని షరతులు విధించగా.. దానిని ఏపీ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ఆ షరతులు లేకుండా నాగరాజును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు షరతుల మేరకు కస్టడీకి తీసుకుంటే.. ప్రతిరోజూ నాగరాజును 160 కిలోమీటర్లు తీసుకువచ్చి.. మళ్లీ పంపించాల్సి ఉంటుందని సీఐడీ సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. అలా చేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వివరించింది. హైకోర్టు తరపు లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. షరతుల్లో తప్పు పట్టాల్సిందేమీ లేదని, రోజు ప్రయాణం చేయడమనేది పెద్ద విషయం కాదని వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.






