మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్

by Naga Rani Yarlagadda |

మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.

మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసు విచారణలో తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో జోక్యం చేసుకుని తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ ఈ దశలో ఉన్నపుడు జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ.. బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికోట్లు సంపాదించారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.

కెసిరెడ్డినే కేంద్ర బిందువుగా ఉన్నారని. మొత్తం వ్యవహారానికీ ఆయనే కుట్రదారుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.700 కోట్లకు పైగా కుంభకోణంలో 9 నెలలపాటు జైల్లో ఉండటం అనేది చాలా చిన్నవిషయమని, ఇది ఎక్కువకాలమేమీ కాదని వ్యాఖ్యానించింది. తాము పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కెసిరెడ్డి తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరడంతో.. తదుపరి విచారణను సీజేఐ ధర్మాసనం 12వ తేదీకి వాయిదా వేసింది.

Next Story