ఆకివీడు రామాలయ నిర్మాణానికి బ్రేక్.. స్టేటస్ కో విధించిన సుప్రీంకోర్టు

by Naga Rani Yarlagadda |

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో రామాలయం నిర్మాణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

ఆకివీడు రామాలయ నిర్మాణానికి బ్రేక్.. స్టేటస్ కో విధించిన సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో రామాలయం నిర్మాణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రామాలయ నిర్మాణ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ నిర్మాణ పనులపై ప్రస్తుత స్థితిని (స్టేటస్-కో) యథాతథంగా కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఇరుపక్షాలు ప్రస్తుత పరిస్థితినే పాటించాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు.. విచారణ వాయిదా

ఈ వివాదాస్పద నిర్మాణ వ్యవహారంలో పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చట్టబద్ధత, స్థానిక వివాదాలపై ప్రభుత్వ వివరణ కోరింది. అనంతరం, ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆకివీడు రామాలయ పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది.

Next Story