- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొంతకాలం జైల్లోనే ఉంటే నష్టమేం లేదు: రాజ్ కెసిరెడ్డిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం రాజ్ కెసిరెడ్డి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డి పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది. గత ప్రభుత్వానికి కెసిరెడ్డి కేవలం సలహాదారుడు మాత్రమేనని అతని తరపు న్యాయవాది తెలుపగా.. ఆయన వాదనలను సీజేఐ ధర్మాసనం తోసిపుచ్చింది. కెసిరెడ్డి కేవలం సలహాదారు మాత్రమే కాదని.. సూత్రధారి అని పేర్కొంది.
ఈ కేసులో మొత్తం వ్యవహారానికి రాజ్ కెసిరెడ్డినే ప్రధాన కుట్రదారుడని పేర్కొంది. పదవిలో ఉన్నవారి అండలేకుండా అధికారులు ఇంతపెద్ద స్కామ్ చేయలేరని ఆరోపించింది. ఇప్పటికే కెసిరెడ్డి జైలులో ఉండి 10 నెలలు గడిచిందని, సప్లిమెంటరీ ఛార్జిషీట్లు కూడా దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఈ సూర్యకాంత్.. మరికొంతకాలం జైల్లోనే ఉంటే వచ్చిన నష్టమేమిలేదని లేదన్నారు. గతంలో ఏపీ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్ కెసిరెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను విచారించేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ ను డిస్మిస్ చేసేందుకు కోర్టు సిద్ధమవ్వడంతో తమ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని రాజ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలుపగా.. అందుకు అంగీకరించింది.






