- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట
ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు సుప్రీంకోర్టులో ఈ రోజు భారీ ఊరట లభించింది. కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం నిందితులకు సుప్రీంకోర్టులో ఈ రోజు భారీ ఊరట లభించింది. కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. అలాగే నింధితులకు సరెండర్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు (Andhra Pradesh Liquor Scam Case)లో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు సరెండర్ (Self-surrender) అవ్వాలనే నిబంధన నుంచి సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయంతో మినహాయింపు దక్కింది. లిక్కర్ కేసులో ఈ ముగ్గురు నిందితులకు గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ అంశంపై 10 రోజుల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నిందితులు సరెండర్ కానవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.






