CIJ: శ్రీవారిని ద‌ర్శించుకున్న సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్​ ఖన్నా

by Thanuru Gopichand |

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇవాళ ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు

CIJ: శ్రీవారిని ద‌ర్శించుకున్న సుప్రీంకోర్టు సీజేఐ సంజీవ్​ ఖన్నా
X

దిశ, ఏపీ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా (Chief Justice) ఇవాళ ఉద‌యం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మొదటిసారిగా తిరుమలకు విచ్చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతించారు. సీజేఐకి సంప్రదాయబద్ధంగా ఇఫ్తికఫాల్ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తరువాత అర్చకులు శేష వస్త్రం కప్పి, రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందజేశారు. తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు

Next Story