- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Liquor Scam: ఎంపీ మిధున్ రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ.. కానీ చిన్న రిలీఫ్
ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురయింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మద్యం కుంభకోణం కేసు (AP Liquor Scam Case)లో వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్ రెడ్డికి (MP Mithun Reddy) సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురయింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అందుకు హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. అప్పటికి మద్యం కుంభకోణం కేసులో మిధున్ రెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడంతో తమకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మిధున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు.
మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ (Anticipatory Bail) పై జస్టిస్ పార్థివాలా ధర్మాసనం విచారణ చేపట్టగా.. ప్రస్తుతం ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా కేసును మళ్లీ విచారించాలని, విచారణ సంస్థ చూపిన కొత్త ఆధారాలను పరిగణలోకి తీసుకొని మిధున్ రెడ్డి బెయిల్ పై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ఏపీ హైకోర్టు (AP High Court)కు సూచించింది. హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకూ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయబోమని ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) సుప్రీం ధర్మాసనంకు తెలిపారు. దీంతో మిధున్ రెడ్డికి చిన్న రిలీఫ్ దక్కినట్లయింది. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం.. 4 వారాల్లో ఎంపీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.






