- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: కౌంటింగ్ వేళ అధికార వైసీపీకి బిగ్ షాక్.. పోస్టల్ బ్యాలెట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వేళ అధికార వైసీపీకి సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వేళ అధికార వైసీపీకి సుప్రీం కోర్టు బిగ్ షాకిచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్వర్వులను వైసీపీ నాయకులు సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి.. మే 30న కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫాం-13 ఏ’ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు.. ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయని ఈసీ తెలిపింది. అయితే, ఆ ఉత్తర్వులను వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. శుక్రవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.






