- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: రాజ్ కెసిరెడ్డికి బిగ్ షాక్.. సుప్రీం కోర్టులో చుక్కెదురు
వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor scam case)లో తమ అరెస్ట్‌ను సవాలు చేస్తూ రాజ్ కెసిరెడ్డి (Raji Kesireddy)తో పాటు ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి (Upender Reddy) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor Scam Case)లో తమ అరెస్ట్‌ను సవాలు చేస్తూ రాజ్ కెసిరెడ్డి (Raji Kesireddy)తో పాటు ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి (Upender Reddy) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ చేపట్టిన జస్టిస్ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్ ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఇవాళ విచారణలో భాగంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే నిందితులు ఇద్దరూ కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అదేవిధంగా వారు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా కొట్టివేస్తున్నట్లుగా తీర్పును వెలువరించింది.
విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra), సిద్ధార్థ్ అగర్వాల్ (Siddharth Agarwal), పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు మహేశ్ జెఠ్మలానీ (Mahesh Jethmalani), పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. రాజ్ కెసిరెడ్డి అరెస్టు అక్రమమని CRPC 160 ప్రకారం మరో రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి నోటీసులు జారీ చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదని మహేశ్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. తాను స్వచ్ఛందంగా విచారణకు హాజరవుతానని చెప్పినా వినకుండా హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసి రిమాండ్ రిపోర్ట్‌లో అవినీతి నిరోధక చట్టాన్ని తన క్లయింట్‌పై ఆపాదించారని కోర్టుకు తెలిపారు. ఎక్సైజ్ పాలసీకి, రాజ్ కెసిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అదేవిధంగా అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ, 19 సెక్షన్ల ప్రకారం సీఐడీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కలుగజేసుకుని.. అరెస్ట్‌తో పాటు కస్టడీ విధించిన టైమ్‌లో పీసీ యాక్ట్‌పై రాజ్ కెసిరెడ్డి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టుకు విన్నవించారు. ఆ విషయంపై ఇప్పటి వరకు వారు బయట మాట్లాడలేదని పిటిషన్‌లో మాత్రమే తెలిపారని పేర్కొన్నారు. నిందితుడు రాజ్ కెసిరెడ్డి (Raj Kesireddy) చెబుతున్న దానికి.. ఆయన తరఫు న్యాయవాదుల వాదనలకు ఏమాత్రం సంబంధం లేకండా ఉందన్నారు. లిక్కర్ స్కామ్‌లో భాగంగా రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని.. ప్రభుత్వా ఆదాయానికి గండి పడిందని ధర్మాసనానికి తెలిపారు. కెసిరెడ్డి అరెస్టు విషయంలో సీఐడీ (CID) అధికారులు అన్ని నియమ నిబంధనలు పాటించారని పేర్కొన్నారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిందితులు ప్రస్తుతం కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అదేవిధంగా వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా కొట్టివేస్తున్నట్లుగా ధర్మాసనం తీర్పును వెలువరించింది.






