- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేక హత్య కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని ప్రశ్నించింది.

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని ప్రశ్నించింది. అవసరం అని భావిస్తే ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలో తెలియజేయాలని జస్టిస్ ఎం.ఎం సుందరేష్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని ఆదేశించింది. నెల రోజుల్లో పూర్తి చేయాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవరించి సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేయాలని చెప్పింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లోనే ఆ విషయం స్పష్టంగా ఉందని, యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. కేసులో ప్రధాన నిందితుల్లో ఏ1గా గంగిరెడ్డి ఉన్నారు. ఏ2గా సునీల్ యాదవ్ ఉన్నారు. ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరపాలని వివేకా కూతురు సునీతా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది.






