- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్మార్ట్ ఫార్మింగ్ కు సహకారం అందించండి : మంత్రి నారా లోకేష్
ఏపీలో ఏఐ ఆధారిత స్మార్ట్ ఫార్మింగ్ కు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులను కోరారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఏఐ ఆధారిత స్మార్ట్ ఫార్మింగ్ కు సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులను కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో బుధవారం భేటీ అయ్యారు. ఏఐ ఆధారిత వ్యవసాయ హబ్ ల ఏర్పాటు ద్వారా ఏపీలో వ్యవసాయ ఆధునీకరణకు సహకరించాలన్నారు. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్ లో నైపుణ్యాలను ఆచార్య ఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలన్నారు. రైతులు, అగ్రి-ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్‌లు, అగ్రి-టెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాలు, స్థిరమైన అభివృద్ధి వ్యూహాలపై పరిశోధన ఆధారిత సూచనలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.






