- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లెనిన్ సెంటరులో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
ప్రజల అభిమాన నటుడికి ఘన నివాళి.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని విజయవాడలో (Vijayawada) దివంగత నటశేఖర, సూపర్‌స్టార్ కృష్ణ (Super Star Krishna) స్మృత్యర్థం ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహావిష్కరణ ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నగరంలోని ప్రధాన కూడలి అయిన లెనిన్ సెంటర్‌లో (Lenin Centre) ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణ నటించిన క్లాసిక్ చిత్రం 'అగ్నిపర్వతం' విడుదలై 45 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అభిమాన సంఘాలు, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విగ్రహావిష్కరణ మహోత్సవంలో కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావుతో పాటు, కృష్ణ మనవడు జయకృష్ణ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. విజయవాడ నగరంతో కృష్ణకు ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు గుర్తు చేసుకున్నారు.
విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో అభిమానుల కోలాహలం మిన్నంటింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు "సూపర్‌స్టార్ కృష్ణ అమర్ రహే" అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ తన తాతగారి విగ్రహాన్ని ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని భావోద్వేగానికి లోనయ్యారు. త్వరలోనే హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్న జయకృష్ణను చూసి అభిమానులు సందడి చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను, ఆయన ప్రయోగాత్మక ధోరణిని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని కృష్ణకు ఘన నివాళులర్పించారు.






