YS Sharmila : సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ : వైఎస్.షర్మిల

by Y. Venkata Narasimha Reddy |

"సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్"(Super Six - Super Flop)అని..కూటమి ప్రభుత్వం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు(End Card) పడ్డట్లేనని..ఇందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu)నిన్నటి ప్రజెంటేషన్ నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief) వైఎస్.షర్మిల(YS Sharmila) ఎక్స్ వేదికగా విమర్శించారు.

YS Sharmila : సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్ : వైఎస్.షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : "సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్"(Super Six - Super Flop)అని..కూటమి ప్రభుత్వం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు(End Card) పడ్డట్లేనని..ఇందుకు సీఎం చంద్రబాబు(CM Chandrababu)నిన్నటి ప్రజెంటేషన్ నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief) వైఎస్.షర్మిల(YS Sharmila) ఎక్స్ వేదికగా విమర్శించారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని చంద్రబాబు నీతి సూక్తులు చెప్పారని..పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలటని.. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు తీరు అని షర్మిల మండిపడ్డారు.

నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని..50 లక్షల మంది అన్నదాతలను వంచించారని.. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని.. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని..50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని విమర్శించారు. పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే చంద్రబాబు.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం అని షర్మిల నిలదీశారు. 'సూపర్ సిక్స్' పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారం అని.. ప్రశ్నించారు. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే కదా అని గుర్తు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో రాష్ట్రాన్ని గాడిన పెడతామన్నది మీరేనని.. తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసమని షర్మిల ప్రశ్నించారు.

రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని.. పథకాల అమలుపై దృష్టి పెట్టండని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు.. రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోడీని పట్టుబట్టండి..పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగండని హితవు పలికారు. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించండని..రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్ళిందో తేల్చండని..పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోండని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story