AP News : నోట్ల మార్పిడి పేరుతో రూ. కోటి కొట్టేసిన దుండగులు

by Muthe.Rajitha |

ఏపీ(AP)లోని తిరుపతి(Tirupati) జిల్లాలోని సూళ్లూరుపేట(Sullurupeta)లో భారీ చోరీ(Robbery) జరిగింది.

AP News : నోట్ల మార్పిడి పేరుతో రూ. కోటి కొట్టేసిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని తిరుపతి(Tirupati) జిల్లాలోని సూళ్లూరుపేట(Sullurupeta)లో భారీ చోరీ(Robbery) జరిగింది. రూ.2,000 నోట్ల మార్పిడి పేరుతో రూ.1 కోటి కొట్టేశారు కేటుగాళ్లు. అయితే సూళ్ళూరుపేట పోలీసులు వేగంగా స్పందించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.73.20 లక్షల నగదును, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి, పట్టుకున్నట్టు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వెల్లడించారు.

వారు బాధితుడి నుంచి కాజేసిన రూ.1 కోటిలో కొంత డబ్బును ఖర్చు చేశారని, మిగిలిన రూ.73.20 లక్షలతో సహా, రెండు కార్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసి, మరిన్ని విషయాలను వెలుగులోకి తీసుకు వస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

Next Story